మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
VZM: వేపాడ మండల పరిధిలోని పాటూరు ఎంపీపీ పాఠశాలను శుక్రవారం ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని' ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూసిన ఎమ్మెల్యే, నాణ్యత విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారు.