VIDEO: కాంగ్రెస్ విజయంపై టీపీసీసీ కీలక వ్యాఖ్యలు
HYD: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండేళ్లుగా జరుగుతున్న అభివృద్ధి, సామాన్యుడికి అందుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారనడానికి ఈ ఫలితాలే ఉదాహరణ అన్నారు. రెండేళ్లలోనే 80 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టే ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు.