VIDEO: 'పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలి'

కోనసీమ: పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు ప్రాధాన్యత ఇవ్వాలని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సూచించారు. ఆయన పి. గన్నవరం మండలంలోని ముంగండ గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా అధికారులు శనివారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి, సర్పంచ్ కుసుమ చంద్రకళ పాల్గొన్నారు.