కనకమహాలక్ష్మి అమ్మవారికి బంగారు హారం సమర్పణ
విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి ప్రముఖ వ్యాపార సంస్థ మెస్సర్స్ తుమ్మిడి బ్రదర్స్ వారు భారీ బంగారు కానుకను బుధవారం సమర్పించారు. అమ్మవారిపై ఉన్న భక్తితో 13 గ్రాముల 623 మిల్లీ గ్రాముల బరువు కలిగిన బంగారు హారాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె. శోభారాణికి అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించారు.