VIDEO: బ్రాహ్మణపల్లి పాఠశాలలో కష్టాలు తీరవా!
CTR: వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లి పాఠశాల దుస్థితి ఇది. పంచాయతీ పరిధిలోని మంచినీళ్ల కుంట చెరువు నుంచి నీరు వెళ్లడానికి సరైన మార్గం లేదు. దీంతో పాఠశాల ఆవరణ మీదుగా నీళ్లు వెళ్తున్నాయి. కాలువను తలపించేలా నీటి ప్రవాహం ఉన్నప్పటికీ ఏ ఒక్క అధికారీ పట్టించుకోవడం లేదని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.