ఇరాన్‌కు రష్యా సంపూర్ణ మద్దతు: పుతిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఘర్షణల వేళ ఇరాన్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ఎన్నికైన ముజ్తబా ఖమేనీకి అభినందనలు తెలిపారు. తన తండ్రి అయతుల్లా ఖమేనీ ఆశయాలను ముజ్తబా కొనసాగిస్తారని.. ఇరాన్ ప్రజలను ఏకం చేస్తారని తెలిపారు. ఇరాన్‌పై దాడులు జరుగుతున్న ఈ సమయంలో ముజ్తబా నాయకత్వం తప్పక అవసరమని పుతిన్ వ్యాఖ్యానించారు.