'హిందీ భాషలో విద్యార్థులు ప్రావీణ్యత పొందాలి'
SKLM: హిందీభాషలో ప్రావీణ్యత పొందాలని పోలాకి(M) ఈదులవలస ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ అన్నారు. బుధవారం ఆపాఠశాలలో హిందీ ప్రచారసభ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. భారతదేశంలో ఉన్న ముఖ్యమైన భాషలలో హిందీ ఒకటని అన్నారు. హిందీ పండిట్ శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది హిందీ పరీక్షలు నిర్వహిస్తున్నాన్నారు.