తొక్కిసలాట.. క్షతగాత్రులను పరామర్శించిన లోకేష్

తొక్కిసలాట.. క్షతగాత్రులను పరామర్శించిన లోకేష్

AP: శ్రీకాకుళంలోని పలాస PHCలో కాశీబుగ్గ తొక్కిసలాటలో గాయపడిన వారిని మంత్రి లోకేష్ పరామర్శించారు. ఆయన వెంట మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ వెళ్లారు. ఈ క్రమంలో వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకునే విధంగా చికిత్స అందించాలని ఆదేశించారు. కాగా ఈ ఘటనలో 13 మంది గాయపడిన విషయం తెలిసిందే.