'పదోన్నతులతో ప్రభుత్వ పాఠశాలలో పండుగ వాతావరణం'

'పదోన్నతులతో ప్రభుత్వ పాఠశాలలో పండుగ వాతావరణం'

KMM: మల్టీ జోన్-1 లో 800 మందికి పైగా ఉపాధ్యాయులకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి లభించడం హర్షించదగిన పరిణామమని జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారావు అన్నారు. శుక్రవారం మధిర మండలంలో ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతులతో ప్రభుత్వ పాఠశాలల్లో పండుగ వాతావరణం నెలకొంది అని పేర్కొన్నారు.