'నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ జారీ చేయాలి'
NLG: గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగులు, ఉపాధ్యాయులు క్రిమిలేయర్ పరిధిలోకి రారని వారికి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ జారీ చేయాలని బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేశ్ అన్నారు. మిర్యాలగూడలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు వివిధ మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే జారీ చేయడం లేదన్నారు.