పల్లె బాట పట్టిన పట్టణ ప్రజలు

పల్లె బాట పట్టిన పట్టణ ప్రజలు

KNR: స్థానిక సంస్థల ఎన్నికల సందడి గ్రామీణ ప్రాంతాల్లో ఊపందుకుంది. రేపు కొన్ని ప్రాంతాల్లో తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బ్రతుకుదేరువు కోసం పట్టణం వచ్చిన ప్రజలు సొంత గ్రామాలకు తిరిగి వస్తున్నారు. గ్రామాభివృద్ధికి సరైన నాయకుడిని ఎన్నుకునే లక్ష్యంగా పయణమవుతున్నారు. దీంతో ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.