'ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకు కఠిన చర్యలు'
SRPT: గ్రామపంచాయతీ ఎన్నికల మొత్తం ప్రక్రియ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) కఠినంగా అమల్లో ఉంటుందని చివ్వెంల ఎస్సై మహేశ్వర్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత కూడా అభ్యర్థులు, కార్యకర్తలు, అనుచరులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు.