కుక్కల దాడిలో 20 మేకపిల్లలు మృతి
SKLM: జిల్లాలో సరుబుజ్జిలి మండలంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇసుకలపాలెం గ్రామానికి చెందిన కొయ్యన ఎర్రయ్య అనే వ్యక్తికి పశువుల కొట్టంలో ఉన్న మేకపిల్లలపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ కుక్కల దాడిలో 20 మేకపిల్లలు మృతి చెందాయి. ప్రభుత్వమే తనను ఆదుకుని పరిహారం అందించాలని బాధితుడు పేర్కొన్నాడు.