'బెల్లపు ఊటలు ధ్వంసం'

SKLM: మందస మండలంలోని గిరిజన గ్రామాలలో శనివారం సోంపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిబ్బంది దాడులు నిర్వహించారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా చుక్కాంబో, సవరరాజపురం గ్రామాలలో నిర్వహించిన తనిఖీలలో సుమారు 1000 లీటర్ల పులిసిన బెల్లపు ఊటలు, 40 లీటర్ల నాటు సారా ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సీఐ కె.బేబీ తెలిపారు.