చిట్టెం నర్సిరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డిలకు ఘన నివాళి

NRPT: ఉమ్మడి మక్తల్ ఎమ్మెల్యే దివంగత నేత చిట్టెం నర్సిరెడ్డి, ఆయన తనయుడు చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డిల జ్ఞాపకార్థం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి నివాళులర్పించారు. నర్సిరెడ్డి కూడలిలోని ఆయన విగ్రహానికి, మార్కెట్ యార్డు వద్ద ఉన్న వెంకటేశ్వర్ రెడ్డి విగ్రహానికి గౌరవం చూపారు. అనంతరం స్వగ్రామమైన ధన్వాడలో వారి సమాధుల వద్ద పూలు వేసి నివాళులర్పించారు.