మరోసారి MGU డిగ్రీ పరీక్షలు వాయిదా

NLG: నల్గొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్ 17 నుంచి 15 వరకు జరగాల్సిన డిగ్రీ పరీక్షలు అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు సీఓఈ డా.ఉపేందర్ రెడ్డి బుధవారం తెలిపారు. తదుపరి నిర్వహణ తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. అంతకుముందు ఏప్రిల్ 11,15,16న డిగ్రీ పరీక్షలను వాయిదా వేశారు.