టీడీపీ నాయకులు చేతులు మీదుగా మట్టి విగ్రహాలు పంపిణీ

E.G: వినాయక చవితి సందర్భంగా అందరూ మట్టి గణపతులను పూజించి, పర్యావరణాన్ని కాపాడాలని టీడీపీ నాయకులు గన్ని కృష్ణ అన్నారు. మంగళవారం స్వాతి మోటార్స్ ఆధ్వర్యంలో ఆయన నగరంలోని విఘ్నేశ్వర ఆలయంలో మట్టి గణపతుల విగ్రహాలను పంపిణీ చేశారు. అలాగే భక్తులకు వినాయక వ్రతకల్ప పుస్తకాలను అందించారు.