మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల దాడులు
JGL: గత కొద్దిరోజులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల జిల్లా కోరుట్ల పురపాలక సంఘంలో విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. పురపాలక సంఘంలోని అన్ని సెక్షన్లలో రికార్డులను పరిశీలించి, విచారణ చేస్తున్నారు. ఈ ఆకస్మిక తనిఖీలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ దాడుల్లో ఏఏ అంశాల్లో అవినీతి బయటపడుతుందో అని పట్టణ ప్రజలు వేచి చూస్తున్నారు.