బంటుమిల్లిలో బోద వ్యాధి నిర్ధారణకు ఇంటింటి సర్వే
కృష్ణా: డాక్టర్ వీ.కె. పవన్ కుమార్ పర్యవేక్షణలో బుధవారం సెంటినిల్ సర్వేలో భాగంగా బంటుమిల్లిలో బీ.ఎన్.ఆర్. కాలనీ, కొత్త హరిజనవాడ, మూడవ దిబ్బ వంటి ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు. దోమలు, క్రిమి కీటకాల ద్వారా ప్రజలు బోద వ్యాధికి గురి కాకుండా ఉండేందుకు 300 రక్తపూతలు సేకరించారు. ముందస్తు చర్యలు చేపట్టడంపై స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.