జన సైనికుల ముసుగులో రౌడీలు: పేర్ని నాని

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై కామెంట్ చేశాడని ఓ RMP వైద్యుడిపై జన సైనికులు దాడి చేయడం దారుణమని మాజీమంత్రి పేర్ని నాని అన్నారు. జనసేన ముసుగులో ఉన్న గుండాలను పోలీసులు అదుపు చేయాలని తెలిపారు. లేకుంటే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని చెప్పారు. ఇప్పటికే నమస్కారం పెట్టలేదని పోలీసులను కొట్టే స్థితికి వచ్చారని వ్యాఖ్యానించారు.