నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి
KMM: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు ఖమ్మం నగరంలో పర్యటించనున్నారు. సాయంత్రం 5.30గంటలకు 36వ డివిజన్ ట్రంక్ రోడ్డులో ఏర్పాటు చేసిన జిల్లా సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. 6గంటలకు 34వ డివిజన్ లో సీసీ రోడ్డు, డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కావున జిల్లా ప్రజాప్రతినిధులు మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు.