యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: డీఎస్పీ

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: డీఎస్పీ

కోనసీమ: డ్రగ్స్, మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయని, యువత వాటికి దూరంగా ఉండాలని కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ సూచించారు. అంబాజీపేట కళాశాలలో మంగళవారం సీఐ భీమరాజు అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థులు తమ అన్నదమ్ములకు, మిత్రులకు డ్రగ్స్ వలన కలిగే అనర్థాలు గురించి వివరించి వారిని రక్షించాలని డీఎస్పీ సూచించారు.