మంత్రుల సమక్షంలో అభివృద్ధిపై సమీక్ష సమావేశం

కృష్ణా: గుడివాడ ఆఫీసర్స్ క్లబ్‌లో మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర నేతృత్వంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుడివాడ నియోజకవర్గంలో రోడ్లు, కాల్వలు, సమస్యలను మంత్రుల దృష్టికి ఎమ్మెల్యే రాము తీసుకువెళ్లారు. ఆక్వా రైతుల ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రులను విజ్ఞప్తి చేశారు.