డిగ్రీ కళాశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

డిగ్రీ కళాశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

SRD: సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళల్లో పోషకాహార లోపం అధికంగా ఉందని, దానిని అధిగమించేందుకు పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.