ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు: కలెక్టర్
గుంటూరులో డయేరియా, కలరా కేసులను అరికట్టడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా హామీ ఇచ్చారు. బుధవారం ప్రగతినగర్‌లో పర్యటించిన అనంతరం ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ట్యాంకర్ల ద్వారా సరఫరా అవుతున్న నీటిని మాత్రమే తాగాలని సూచించారు.