దుకాణంలోకి దూసుకెళ్లిన కారు

దుకాణంలోకి దూసుకెళ్లిన కారు

KNR: కరీంనగర్ నుంచి హుజురాబాద్ వెళ్తున్న కారు అదుపు తప్పి కేశవపట్నంలో ఓ కిరాణా దుకాణంలోకి దూసుకెళ్లింది. ఘటనలో విద్యుత్ స్తంభం విరిగి, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కారు వేగంగా ఢీ కొట్టడంతో షాపు ముందు ఉన్న బైక్, మెట్లు దెబ్బతిన్నాయి. ప్రమాదం నుంచి డ్రైవర్ మహేందర్ సురక్షితంగా బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.