వరి ధాన్యం కొనుగోలు పారదర్శకంగా చేపట్టాలి: కలెక్టర్
VKB: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2,389, సాధారణ రకానికి 2,369 మద్దతు ధరతో పాటు, సన్న రకాలకు ప్రభుత్వం ప్రకటించిన 500 బోనస్‌ను అందించాలని తెలిపారు.