కొబ్బరిబోండాల వాహనం బోల్తా.. వ్యక్తి మృతి
KMM: తిరుమలాయపాలెం మండలంలోని కొక్కిరేణికి చెందిన దొడ్డి శ్రీను (62) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన విశ్వనాథంతో ఉదయం 7గంటల సమయంలో ఖమ్మంలో కొబ్బరిబోండాల పనికి వెళ్లి తిరిగి వస్తుండగా రూరల్ శ్రీ సిటీ వద్ద కొబ్బరిబోండాల వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో శ్రీను అక్కడే మృతి చెందగా, విశ్వనాథానికి గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు.