కోడి పందాలు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తుల అరెస్ట్

CTR: చౌడేపల్లి మండలం చిన్నకంపల్లి గ్రామ సమీపంలో ఆదివారం కోడి పందాలు నిర్వహిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు ఎస్సై నాగేశ్వరరావు సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ మేరకు కోడిపందాలు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రెండు పందెం కోళ్ళు 2400 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగేశ్వరరావు తెలిపారు.