అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే నాని

తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తిరుపతి రూరల్ మండలంలోని పలు పంచాయతీలలో గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యేకు గ్రామపంచాయతీ పినపెద్దలు, నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గంగమ్మ తల్లి దర్శించుకుని, అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.