‘మూడు రోజులు మిషన్ భగీరథ నీళ్లు బంద్’

‘మూడు రోజులు మిషన్ భగీరథ నీళ్లు బంద్’

NGKL: మిషన్ భగీరథ పైపులైన్‌ల మరమ్మతుల కారణంగా జిల్లాలో కల్వకుర్తి సబ్ డివిజన్ పరిధిలోని వెల్దండ, చారకొండ, వంగూరు, ఊర్కొండ, మిడ్జిల్ మండలాలకు మూడు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు డిప్యూటీ ఈఈ మణిపాల్ తెలిపారు. ఈ రోజు గురువారం మధ్యాహ్నం నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఈ అంతరాయం ఉంటుందని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.