రంగంపేట సర్పంచ్‌గా గున్నల లక్ష్మి నామినేషన్
KMR: రంగంపేట గ్రామ సర్పంచ్ పదవికి గున్నల లక్ష్మి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. శుభ్రత, త్రాగునీరు, రహదారులు, విద్యుత్ సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వ్యాఖ్యలు చేశారు. నిష్పక్షపాతంగా, పార్టీలకతీతంగా అభివృద్ధి ఫలాలను, ప్రభుత్వ పథకాలను నిరుపేదలకు అందిస్తానని తెలిపారు.