ఓటు వేసి వెళ్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

ఓటు వేసి వెళ్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

KMM: మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేళ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సత్తుపల్లి మండలం బేతుపల్లిలో ఓటు వేసి ఇంటికి వెళ్తుండగా సత్యనారాయణ(65) అనే వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతడిని సత్తుపల్లి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియనుంది.