పింఛన్‌దారులపై నోటీసుల ఆందోళన..!
NDL: మహానంది మండలం గాజులపల్లెలో 83 మంది డప్పు, చర్మ కారుల పింఛన్దారులకు నోటీసులు ఇవ్వడం దారుణమని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కోలా కళ్యాణ్, దర్గయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద బాధితులతో ఆందోళన నిర్వహించి ఏవో శ్రీనివాసరెడ్డిని కలిశారు. వెంటనే లబ్ధిదారులకు తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.