యుద్ధంలో 70 వేలు దాటిన మరణాలు

యుద్ధంలో 70 వేలు దాటిన మరణాలు

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం మొదలైనప్పటి నుంచి మరణించిన పాలస్తీనీయన్ల సంఖ్య 70 వేలు దాటిందని హమాస్‌ అధీనంలోని గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్‌ తాజాగా జరిపిన దాడుల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఓ ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. అక్టోబర్‌ 10న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ.. మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.