బీహార్, బెంగాల్‌లో పర్యటించనున్న మోదీ

ప్రధాని మోదీ ఈనెల 22న బీహార్, పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు. బీహార్ గయలో దాదాపు రూ.13,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించనున్నారు. రెండు కొత్త రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. కోల్‌కతాలో రూ.5,200 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అంతేకాకుండా, నూతనంగా నిర్మించిన మెట్రో సేవలను మోదీ ప్రారంభిస్తారు.