VIDEO: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
E.G: రాజానగరం జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. రహదారిపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురికి గాయాలు కావడంతో వెంటనే స్థానికులు చికిత్స కోసం రాజానగరం జీఎస్ఎల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.