మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి

మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి

HYD: మెగాస్టార్ చిరంజీవి తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్‌లు పెడుతున్నారంటూ మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఒక 'ఎక్స్' ఖాతాను జోడిస్తూ ఆయన ఫిర్యాదు చేశారు. ఇటీవల హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తన పేరు, ఫొటో, వాయిస్‌లను అనుమతి లేకుండా వాడొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, కొందరు వాటిని ఉల్లంఘిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.