గ్యాస్ గోదామును తనిఖీ చేసిన అశుతోష్
గుంటూరు జిల్లా తెనాలిలోని పినపాడులో పౌరసరఫరాల విభాగ గ్యాస్ గోదామును జిల్లా సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క గ్యాస్ సిలిండర్ పక్కదారి పట్టినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటీపీ లేకుండా సిలిండర్లు ఇవ్వడం, అసలు యజమానికి కాకుండా ఇతరులకు ఇవ్వడం వంటివి చేయవద్దన్నారు.