చేనేత వస్త్రాలయాలను సందర్శించిన MP

KRNL: చేనేత కార్మికుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కర్నూలు ఎంపీ నాగరాజు తెలిపారు. గురువారం ఆయన కర్నూలు నగరంలోని పలు చేనేత వస్త్రాలయాలను సందర్శించారు. ఎన్నికల హామీ మేరకు ప్రతి చేనేత కుటుంబానికి నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేనేతలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.