కల్వరి టెంపుల్‌లో మినీ క్రిస్మస్ వేడుకలు
KNR: హుజురాబాద్ మండలం రంగాపూర్ కల్వరి టెంపుల్‌లో చర్చి ఫాదర్ రెవరెండ్ డాక్టర్ పీఆర్. నెల్సన్ ఆధ్వర్యంలో ఘనంగా కోతకాల పండుగ, మినీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా దైవ సందేశం అందించడానికి రెవరెండ్ కే. సీమోను బాబు, డాక్టర్ జైదా ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు పుష్పలత, గుడిపాటి జయపాల్ రెడ్డి హాజరైనారు.