మద్యం సేవించి గుర్తు తెలియని వ్యక్తి మృతి

మద్యం సేవించి గుర్తు తెలియని వ్యక్తి మృతి

అన్నమయ్య: ములకలచెరువు మండలంలోని షాది మహల్ ఎదుట సోమవారం అతిగా మద్యం సేవించిన గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు సమాచారం అందించడంతో 108 సిబ్బంది అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రి సిబ్బంది అతను అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు విచారణ చేపట్టారు.