'వార్డులో వెంటనే తాగునీరు అందించాలి'

సత్యసాయి: ధర్మవరం పట్టణం 26వ వార్డు మహాత్మా కాలనీలో పది రోజులుగా తాగునీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలు శుభ్రం చేయకపోవడం వల్ల సమస్యలు మరింత పెరిగాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుడు టైలర్ గోపాల్ వార్డును సందర్శించి, అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.