నీటి బకెట్లో పడి చిన్నారి మృతి

నీటి బకెట్లో పడి చిన్నారి మృతి

NGKL: లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. చింతకుంట మల్లేష్ కుమార్తె (3) ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ ఇంట్లోని నీటి బకెట్లో పడిపోయింది. కుటుంబ సభ్యులు గమనించేలోపే ఊపిరి ఆడక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ కళ్లముందే మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.