గ్రామ దేవాలయాలు శిథిలావస్థలో.. ప్రజల ఆవేదన
MBNR: గుండుమాల్ మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ దేవత గుడులు శిథిలావస్థకు చేరాయి. ఈ సందర్భంగా గుడి పునర్నిర్మాణం, రోడ్డు పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామ అధికారులు, పెద్దలు ఈ సమస్యపై దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఆలయాల పరిస్థితిపై ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.