వరకట్నంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
వివాహల కోసం వరకట్నాలు తీసుకోవడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పరస్పర విశ్వాసం, నమ్మకం, గౌరవంగా ఉండే వివాహ వ్యవస్థ ఇటీవలి కాలంలో వాణిజ్య లావాదేవీగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. పవిత్రమైన వివాహ వ్యవస్థ కట్నాలతో కమర్షియల్‌గా మారిందని విచారం వ్యక్తం చేసింది. కానుకలు, బహుమతుల పేరుతో ఇచ్చే వరకట్నం సామాజిక హోదాను చూపించే ప్రయత్నమని పేర్కొంది.