ధాన్యం శుభ్రపరిచే యంత్రాలను ఏర్పాటు చేయాలి: కలెక్టర్

NLG: జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్ యార్డులు, పెద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం శుభ్రపరిచే ఆటోమేటిక్ యంత్రాలను కొనుగోలు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఛాయాదేవిని ఆదేశించారు. తిప్పర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం శుభ్రపరిచే యంత్రాన్ని కలెక్టర్ బుధవారం పరిశీలించారు.