లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 40 మంది మృతి
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు పెంచింది. నబీచిట్ పట్టణంపై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఇప్పటి వరకు 41 మంది మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రి వెల్లడించారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. హిజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా నెతన్యాహూ సైన్యం మిసైళ్లతో దాడులు చేయడంతో పలు ప్రాంతాల్లో భవనాలు ధ్వంసమయ్యాయి.