జంట జలాశయాల గేట్లు ఎత్తివేత

జంట జలాశయాల గేట్లు ఎత్తివేత

RR: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జంట జలాశయాలకు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో జలమండలి అధికారులు అప్రమత్తమై ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తి వరద నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ నుంచి 920 క్యూసెక్కులు, హిమాయత్ సాగర్ నుంచి 1350 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.