నేడు కొత్త పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్

NGKL: 'ఇందిరా సౌర గిరి జల వికాసం' పథకాన్ని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో CM రేవంత్ నేడు ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా విద్యుత్ సౌకర్యం లేని పోడు భూములకు సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేసి నీటిని అందిస్తారు. 6 లక్షల ఎకరాలకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ROFR (అటవీ హక్కుల చట్టం-2006) ప్రకారం భూములు కలిగి ఉన్న గిరిజన రైతులు ఈ పథకానికి అర్హులు.